కష్టాలు, త్యాగాలతోనే ఉన్నత స్థాయికి చేరొచ్చు
eenadu telugu news
Published : 29/07/2021 05:56 IST

కష్టాలు, త్యాగాలతోనే ఉన్నత స్థాయికి చేరొచ్చు


కేక్‌ కేస్తున్న డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయన సతీమణి నిర్మల తదితరులు

పొన్నూరు, న్యూస్‌టుడే: విజ్ఞాన్‌ విద్యా సంస్థల అధ్యక్షుడు డాక్టర్‌ లావు రత్తయ్య 70వ జన్మదిన వేడుకలను బుధవారం చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి డీమ్డ్‌ టు బీ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. రత్తయ్య సతీమణి నిర్మల, విజ్ఞాన్‌ విద్యా సంస్థల వైస్‌ ఛైర్‌పర్సన్‌ బోయపాటి రుద్రమ్మదేవి, ఉపకులపతి డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ పీఎంవీ రావు, విజ్ఞాన్‌ లారా కళాశాల ప్రిన్సిపల్‌ కె.ఫణింద్రకుమార్‌, విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ పి.శ్రీనివాసబాబు, విజ్ఞాన్‌ వైజాగ్‌ సీఈవో శ్రీకాంత్‌, తదితరుల సమక్షంలో డాక్టర్‌ లావు రత్తయ్య కేక్‌ కోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ఎవరైనా ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే వారు ఎదుర్కొనే కష్టాలు, చేసే త్యాగాలను బట్టి ఫలితం లభిస్తుందన్నారు. విజ్ఞాన్‌ లారా మూడో సంవత్సరం విద్యార్థి దాసరి యశ్వంత్‌ 2368 చదరపు అడుగుల లావు రత్తయ్య చిత్రపటాన్ని వేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో రెండు వేల మొక్కలు నాటారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని