రాష్ట్రంలో క్రీడా కార్యక్రమాలు పునః ప్రారంభం
eenadu telugu news
Published : 04/08/2021 01:13 IST

రాష్ట్రంలో క్రీడా కార్యక్రమాలు పునః ప్రారంభం

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ క్రీడా కార్యక్రమాలను పునఃప్రారంభించడానికి రాష్ట్రంలోని అన్ని స్టేడియాలు, జిమ్‌లు, క్రీడా పాఠశాలలు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, ఈత కొలనులకు ప్రభుత్వం అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసిందని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు. ప్రభుత్వం వెల్లడించిన ఆదేశాలపై తక్షణమే తగు చర్యలు తీసుకొని క్రీడా కార్యక్రమాలు పునఃప్రారంభించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని కలెక్టర్లు, డీఎస్‌ఏ ఛైర్మన్లను ఆయన కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని