ఖోఖో బాలికల జట్టుకు ముగిసిన శిక్షణ
eenadu telugu news
Published : 21/09/2021 03:17 IST

ఖోఖో బాలికల జట్టుకు ముగిసిన శిక్షణ


క్రీడాకారిణులకు దుస్తులు అందజేస్తున్న స్పందన

గుడివాడ, న్యూస్‌టుడే: ఎస్‌పీఎస్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్న జూనియర్‌ బాలికల ఖోఖో రాష్ట్ర జట్టు శిక్షణ సోమవారంతో ముగిసింది. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో ఈ నెల 22 నుంచి 26 వరకూ జరిగే 40వ జాతీయ జూనియర్‌ బాలికల ఖోఖో పోటీలకు ఎంపికైన 16 మంది రాష్ట్ర క్రీడాకారులకు స్థానికంగా ఈ నెల 7 నుంచి శిక్షణ ఇస్తున్నారు. వారికి రైట్‌సెట్‌ ఇండస్ట్రీస్‌ అధినేత చలసాని గణేశ్‌-స్పందన దంపతుల ఆర్థిక సౌజన్యం ~t 50 వేలతో ఆహారం, వసతి అందించారు. ముగింపు సందర్భంగా ఈ దంపతులు క్రీడాకారిణులకు దుస్తులను అందజేశారు. ఖోఖో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు టీఎస్‌ఆర్‌కే.ప్రసాద్‌, సీతారామిరెడ్డి, జాతీయస్థాయి కోచ్‌ మడకా ప్రసాద్‌, హెచ్‌ఎం ఎస్‌కేశ్రీనివాసరావు, పీడీ అనూరాధ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని