ఇంటి నుంచి పరిషత్తుకు
eenadu telugu news
Published : 23/09/2021 03:15 IST

ఇంటి నుంచి పరిషత్తుకు

జడ్పీటీసీలుగా ఎన్నికెనౖ మహిళలు
జిలాపరిషతు (గుంటూరు), న్యూస్‌టుడే

నిన్నటి వరకు ఇంటికే పరిమితమైన మహిళలు నేడు ప్రజా బాహుళ్యంలోకి వస్తున్నారు. పరిషత్‌ ఎన్నికల్లో జడ్పీటీసీ సభ్యులుగా గెలుపొంది జడ్పీ పాలకవర్గంలో భాగస్వాములు కానున్నారు. జిల్లాలో జరిగిన 45 జడ్పీటీసీ స్థానాల్లో వైకాపాకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో కొల్లిపర జడ్పీటీసీ స్థానం నుంచి గెలుపొందిన కత్తెర హెని క్రిస్టినా ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈనెల 25న పరోక్ష విధానంలో జరగనున్న ఎన్నికల్లో జడ్పీటీసీ సభ్యులు ఆమెను ఎన్నుకోనున్నారు. ప్రజాక్షేత్రంలో గెలుపొందిన జడ్పీటీసీలు ఆయా రంగాలకు చెందిన వారు ఉన్నారు. అత్యధికులు గృహిణులు, తర్వాత స్థానంలో వ్యవసాయం చేసే వారున్నారు. వ్యాపారస్థులు, ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు, నిరక్షరాస్యులూ ఎన్నికయ్యారు.

* తెనాలి జడ్పీటీసీ స్థానం సభ్యురాలిగా గెలుపొందిన పిల్లి ఉమాప్రణతి బి.ఎ. పట్టభద్రురాలు. ఆమె విద్యార్థిగా కొనసాగుతూనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. జడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అవడంతో వైకాపా నుంచి పోటీ చేసి 23,340 ఓట్లు సాధించి తెదేపా అభ్యర్థిపై విజయం సాధించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని