పరిశోధనాత్మక వైద్య విద్యకు ప్రాధాన్యం
eenadu telugu news
Published : 26/09/2021 03:52 IST

పరిశోధనాత్మక వైద్య విద్యకు ప్రాధాన్యం


బెస్ట్‌ అవుట్‌ గోయింగ్‌ విద్యార్థి సాయి హనీషాకు పతకం అందజేస్తున్న రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శంకర్‌, ప్రిన్సిపల్‌ రాజ్యలక్ష్మి

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: పరిశోధనాత్మక వైద్య విద్యకు ప్రాధాన్యం ఇస్తేనే, పరిపూర్ణ పట్టభద్రులు అవుతారని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్‌ అన్నారు. నగరంలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల 2014 బ్యాచ్‌ ఎంబీబీఎస్‌ పట్టభద్ర స్వీకారోత్సవం శనివారం స్థానిక పరిణయ కల్యాణ మండపంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ కరోనా మహమ్మారితో యావత్‌ ప్రపంచం కకావికలం కాగా వైద్యులకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందన్నారు. ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని పేదలకు అందించే బాధ్యత భావి వైద్యులు తీసుకోవాలని చెప్పారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ నిబద్ధతతో కూడిన వైద్య వృత్తి వైపు దృష్టి పెట్టాలని సూచించారు. అంతకుముందు కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్‌ అమ్మన్న, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విజయలక్ష్మి, మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ వెంకట కృష్ణలు విద్యార్థులతో ప్రమాణం చేయించారు. 2020 బెస్ట్‌ అవుట్‌ గోయింగ్‌ విద్యార్థిగా సాయి హనీషా ఆరుమళ్లకు బంగారు పతకాన్ని డాక్టర్‌ శంకర్‌ అందజేశారు. బెస్ట్‌ అవుట్‌ గోయింగ్‌ ఇన్‌ స్పోర్ట్సుగా డాక్టర్‌ ఆర్‌.లలిత్‌ నిలిచారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని