టైల్స్‌ కార్మికుడిపై పోక్సో కేసు
eenadu telugu news
Published : 21/10/2021 03:54 IST

టైల్స్‌ కార్మికుడిపై పోక్సో కేసు

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే : ప్రేమ పేరుతో బాలికకు మాయమాటలు చెప్పి బలవంతంగా లోబరుచుకున్న యువకుడిపై అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు పోక్సో యాక్టు ప్రకారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఎం.కె.బేగ్‌ పాఠశాల సమీపంలో నివాసముంటున్న కట్టా సాయి(22) టైల్స్‌ పనులు చేస్తుంటాడు. పరిసర ప్రాంతానికి చెందిన ఓ బాలిక (15) పదో తరగతి వరకు చదువుకుంది. కరోనా నేపథ్యంలో పై చదువులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటోంది. రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని సాయి.. సదరు బాలిక వెంట పడుతున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ నెల 18న మాయమాటలు చెప్పి ఇంట్లోంచి రమ్మని చెప్పి, వరంగల్‌ తీసుకెళ్లాడు. ఒక రోజు అక్కడ ఉన్న తర్వాత, తనకు భయమేస్తోందని బాలిక చెప్పడంతో ఇక్కడికి తీసుకొచ్చి, వదిలిపెట్టి వెళ్లి పోయాడు. ఇంటికి వచ్చిన బాలికను పెద్దమ్మ నిలదీసింది. బాలిక జరిగిన విషయం తెలిపింది. సాయి తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడని చెప్పింది. ఘటనపై బాధితురాలి పెద్దమ్మ మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని