మేజర్‌ పంచాయతీ.. సమస్యలతో పేచీ
eenadu telugu news
Published : 23/10/2021 06:20 IST

మేజర్‌ పంచాయతీ.. సమస్యలతో పేచీ


సచివాలయం సమీపంలో నీటి తొట్టె వద్ద పేరుకున్న చెత్త

కొడిగెనహళ్లి (పరిగి), న్యూస్‌టుడే: మేజర్‌ పంచాయతీగా గుర్తింపు పొందిన కొడిగెనహళ్లిలో పారిశుద్ధ్యం లోపించింది. పంచాయతీ పరిధిలో కాలువపల్లి, పెద్దరెడ్డిపల్లి, సుబ్బరాయనపల్లి, సేవామందిర్‌ గ్రామాలు ఉన్నాయి. బీసీ కాలనీ, ఎస్సీ కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. సచివాలయం-2 సమీపంలో చెత్త వేస్తున్నారంటే.. పారిశుద్ధ్యం ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. 10 మంది పారిశుద్ధ్య కార్మికులు, తొలగించిన చెత్తను తరలించేందుకు ట్రాక్టరుతో పాటు మూడు చక్రాల సైకిళ్లు ఉన్నాయి. అధికారులు పర్యవేక్షణ లేక పోవడంతో సమస్య ఏర్పడుతోంది. ఈ విషయాన్ని ఎంపీడీవో రామారావు దృష్టికి తీసుకెళ్లగా కొడిగెనహళ్లి పంచాయతీలో పారిశుద్ధ్య పనులు మెరగు పరిచేందుకు తగు చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని