Updated : 23/05/2020 20:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మూడు జిల్లాలకు శ్రీవారి లడ్డూలు తరలింపు

తిరుమల: శ్రీవారి లడ్డూలు శనివారం ఉదయం తిరుమల నుంచి రాష్ట్రంలోని మూడు జిల్లాలకు తరలించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలోని తితిదే కల్యాణమండపాలకు శ్రీవారి లడ్డూలను మూడు లారీల్లో తరలించారు. లడ్డూలు తరలిస్తున్న మూడు లారీలకు తితిదే అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి పూజలు నిర్వహించారు. లక్షా పది వేల లడ్డూలను లారీల ద్వారా మూడు జిల్లాలకు పంపించారు. పది వేల లడ్డూలను తిరుపతిలోని భక్తులకు పంపించారు. కరోనా వైరస్‌ ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రాకపోకలను తితిదే రద్దు చేసిన విషయం తెలిసిందే. గత రెండు నెలలుగా భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేయడంతో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రతి జిల్లాలోని తితిదే కల్యాణ మండపాలు, సమాచార కేంద్రాల్లో లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని