Published : 21/04/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కీర్తనలను జనంలోకి తీసుకెళ్లాలి

తితిదే ఈవో డాక్టర్‌ జవహర్‌రెడ్డి


ప్రాజెక్టులపై సమీక్షిస్తున్న ఈవో

తిరుపతి(తితిదే): తిరుమల శ్రీవారిని కీర్తిస్తూ తాళ్లపాక అన్నమాచార్యులు, తరిగొండ వెంగమాంబ రాసిన కీర్తనలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తితిదే ఈవో డాక్టర్‌ కేఎస్‌.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో మంగళవారం వివిధ ప్రాజెక్టుల ప్రగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌ సాయికృష్ణ యాచేంద్ర స్వర పరిచిన కీర్తనలను ప్రదర్శించారు. ఈవో మాట్లాడుతూ.. ఎస్వీబీసీ ఛైర్మన్‌ స్వరపరిచిన కీర్తనలు బాగున్నాయన్నారు. ఎస్వీబీసీలో కార్యక్రమాల మధ్యలో వీటిని ప్రసారం చేయడానికి చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. అన్నమయ్య సంకీర్తనలను అర్థ, తాత్పర్యాలతో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జరుగుతున్న ప్రగతిపై చర్చించారు. 599 దాస సాహిత్య కీర్తనలు తమ వద్దకు వచ్చాయని ప్రత్యేకాధికారి వివరించారు. పూర్తి అయినవి అయినట్లు తితిదే వెబ్‌సైట్‌లో అప్లోడ్‌ చేయాలని ఈవో ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి వరకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి తనకు అందించాలన్నారు. కొవిడ్‌ పెరుగుతున్న నేపథ్యంలో కల్యాణమస్తు కార్యక్రమం ఎలా నిర్వహించవచ్చో ఆలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌ దక్షిణామూర్తిశర్మ, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్‌, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు, ఎస్వీబీసీ సీఈవో సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని