మఠం ఏవో నుంచి మిశ్రా తొలగింపు
logo
Published : 06/05/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మఠం ఏవో నుంచి మిశ్రా తొలగింపు


మిశ్రా

 

తిరుపతి(తాతయ్యగుంట), న్యూస్‌టుడే: తిరుపతి హథీరాంజీ మఠంలో పనిచేస్తున్న మిశ్రాను బాధ్యతలను నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. మఠం మహంత్‌గా వ్యవహరిస్తున్న అర్జున్‌దాస్‌ మహంత్‌ తనకు కావాల్సిన వారికి ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇస్తూ మఠం ఉద్యోగులను పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం మఠం వాచ్‌మెన్‌గా (ఔట్‌సోర్సింగ్‌) పనిచేస్తున్న బసవరాజు మఠంలోనే గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు మహంత్‌, మిశ్రా కారణమని మఠంలోనే గొంతు కోసుకున్న తరువాత బయటకు వచ్చిన రక్తంతో బసవరాజు రాశాడు. ఈ అంశం అప్పట్లో చర్చనీయాంశమైంది. తిరుపతి తూర్పు పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. బసవరాజు మరణానికి కారణమైన మహంత్‌ను, మిశ్రాను అరెస్టు చేయాలంటూ మఠం వద్ద కొన్ని సంఘాలు ధర్నాలు చేశాయి. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కొందరు దేవాదాయ శాఖను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు మఠంలో అనధికారికంగా మిశ్రా అనే వ్యక్తి అడ్మినిస్టేషన్‌ అధికారి (ఏవో) స్థాయిలో ఉన్నారని గుర్తించి తొలగించారు. 60 సంవత్సరాలు నిండిన వారి సేవలు మఠంలో అవసరం లేదంటూ ప్రస్తుతం దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ ఉత్తర్వులు విడుదల చేయడంతో మఠంలో పనిచేస్తున్న అనధికార ఉద్యోగుల్లో గుబులు మొదలైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని