రత్నం కీర్తి.. రమణమూర్తి
eenadu telugu news
Published : 21/09/2021 03:02 IST

రత్నం కీర్తి.. రమణమూర్తి


కోసూరి వెంకట రమణమూర్తి

 

రాజమహేంద్రవరం సాంస్కృతికం: మహాత్ముడి స్వదేశ ఉద్యమ స్ఫూర్తితో ఊపిరి పోసుకున్న రత్నం పెన్నుల తయారీ సంస్థ వారసుడు, రెండో తరానికి చెందిన కె.వి.రమణమూర్తి(80) సోమవారం కన్నుమూశారు. రమణమూర్తి తండ్రి వెంకటరత్నం 1932లో రాజమహేంద్రవరంలో సంస్థను స్థాపించారు.అఖిల భారత ఖాదీ గ్రామీణ సంస్థ కార్యదర్శి కుమరప్ప 1933లో ఈ సంస్థను సందర్శించి రెండు పెన్నులు తీసుకెళ్లారు. వాటిలో ఒక పెన్నును గాంధీజీకి అందజేశారు. దానిని చూసి అభినందిస్తూ బాపూజీ లేఖ రాశారు. సి.వై.చింతామణి, న్యాపతి సుబ్బారావు పంతులు, రామనాథ్‌ గోయంకా ఈ పెన్నులు వాడి ప్రశంసించారు. రాష్ట్రపతులు బాబురాజేంద్రప్రసాద్‌, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, వి.వి.గిరి, శంకర్‌ దయాళ్‌శర్మ, ప్రధానులునెహ్రూ, లాల్‌బహుదూర్‌శాస్త్రి, ఇందిర..పలువురు గవర్నర్లు ఈ పెన్నులు వాడారు. 1981లో వెంకటరత్నం మరణించాక.. ఆయన కుమారుడురమణమూర్తి సంస్థ బాధ్యత చేపట్టి ప్రగతిబాట పట్టించారు. 2019లో జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ భారత్‌వచ్చినపుడుప్రధాని మోదీ రత్నం పెన్ను ఆమెకు బహుమతిగా అందించడం గమనార్హం.రమణమూర్తి మృతికి ఎంపీ భరత్‌,స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చందన నాగేశ్వర్‌ సంతాపం తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని