సీపీవోగా త్రినాథ్‌ బాధ్యతల స్వీకరణ
eenadu telugu news
Published : 21/09/2021 03:02 IST

సీపీవోగా త్రినాథ్‌ బాధ్యతల స్వీకరణ

త్రినాథ్‌ను అభినందిస్తున్న అధికారులు

కాకినాడ కలెక్టరేట్‌: జిల్లా ముఖ్య ప్రణాళికాధికారిగా(సీపీవోగా పి.త్రినాథ్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అర్థ గణాంక శాఖలో ఉప సంచాలకుడి హోదాలో విజయవాడలో సంచాలకుడి కార్యాలయంలో పనిచేస్తున్న ఆయనకు సంయుక్త సంచాలకుడిగా ఉద్యోగోన్నతి కల్పించి ఇక్కడ నియమించారు. ఆయనను అధికారులు, సిబ్బంది అభినందించారు. ● ఉప సంచాలకుడు పి.బాలాజీకి సంయుక్త సంచాలకుడిగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ విజయవాడలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలో నియమించారు. ఆయన స్థానంలో ఉప సంచాలకుడిగా విజయవాడ డైరెక్టర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనివాస్‌ను నియమించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని