తగ్గిన గోదావరి వరద
eenadu telugu news
Published : 18/10/2021 01:30 IST

తగ్గిన గోదావరి వరద

గండిపోశమ్మ ఆలయ మండపంలో ముంపునీరు

దేవీపట్నం: గోదావరి వరద శాంతించడంతో ముంపు గ్రామాల నిర్వాసితులు ఊపిరి పీల్చుకుంటున్నారు. నెలల తరబడి వరద ప్రవాహం భవనాలను సైతం ముంచెత్తింది. ఈ క్రమంలో పూరిళ్లు కొన్ని కొట్టుకుపోగా మరికొన్ని నేలకూలాయి. గండిపోశమ్మ ఆలయం వద్ద వరద నీరు తగ్గడంతో అమ్మవారు బయటకు దర్శనమిస్తున్నారు. ఆలయ మండపంలోని వరద నీరు తగ్గింది. మొన్నటి వరకూ వరద కారణంగా రహదారి పైనుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్లేవారు. ఆదివారం వరద తగ్గడంతో ఆలయానికి భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ ఏడాది గండిపోశమ్మ ఆలయం దాదాపు నాలుగు నెలలుగా వరద ముంపులోనే ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని