నూతన హైవే వేగంగా నిర్మించండి
eenadu telugu news
Published : 04/08/2021 01:48 IST

నూతన హైవే వేగంగా నిర్మించండి

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వినతి


గడ్కరీకి జ్ఞాపిక అందజేస్తున్న శ్రీకృష్ణదేవరాయలు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ నుంచి పేరేచర్ల వరకు కొత్త జాతీయ రహదారిని వేగంగా నిర్మించాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు. ఈ మేరకు మంగళవారం దిల్లీలో కేంద్ర మంత్రిని కలిసినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పల్నాడు ప్రాంతానికి జాతీయ రహదారిని మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. హైవే నిర్మాణం పల్నాడు ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని ఎంపీ వివరించారు. త్వరితగతిన నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారని శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని