సెప్టెంబరు 24 నుంచి ‘పీ సెట్‌’
eenadu telugu news
Published : 04/08/2021 01:48 IST

సెప్టెంబరు 24 నుంచి ‘పీ సెట్‌’

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘పీ సెట్‌’ సెప్టెంబరు 24 నుంచి ప్రారంభం కానుంది. దీని నిర్వహణపై మంగవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కన్వీనర్‌ డాక్టర్‌ జాన్సన్‌ ఆధ్వర్యంలో సమీక్ష జరిపారు. ఈనెల 5న పీసెట్‌ ప్రకటన విడుదల చేయనున్నారు. వచ్చేనెల 5 వరకు దరఖాస్తులు తీసుకుంటారు. రూ.500 అపరాధ రుసుంతో సెప్టెంబరు 16 వరకు ఫీజు చెల్లించవచ్ఛు సెప్టెంబరు 22 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, 24 నుంచి ఎంపికలు జరుగుతాయని కన్వీనర్‌ డాక్టర్‌ జాన్సన్‌ చెప్పారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా కొవిడ్‌ నిబంధనల ప్రకారం ‘సెట్‌’ నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. పురుషులకు 100, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌ జంప్‌, హైజంప్‌, షాట్‌పుట్‌ అంశాలతో పాటు ఏదైన ఒక క్రీడ, అలాగే మహిళలకు 100, 400 మీటర్ల పరుగుపందెం పోటీలు, లాంగ్‌జంప్‌, హైజంప్‌, షాట్‌పుట్‌ అంశాలతో పాటు ఏదైన ఓ క్రీడలో నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య హేమచంద్రారెడ్డి, పీసెట్‌ ఛైర్మన్‌ ఆచార్య రాజశేఖర్‌, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య రామ్మోహన్‌రావు, ఆచార్య లక్ష్మమ్మ, కార్యదర్శి సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌, ప్రత్యేక అధికారి సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని