కొవిడ్‌ ఆసుపత్రిలో రోగుల కష్టాలు
eenadu telugu news
Published : 21/09/2021 01:37 IST

కొవిడ్‌ ఆసుపత్రిలో రోగుల కష్టాలు

ప్లేట్లు, మంచినీరు లేక అవస్థలు


చెత్తకుండీలో ఆహారాన్ని పడవేస్తున్న సిబ్బంది

నరసరావుపేటలీగల్‌, న్యూస్‌టుడే: పట్టణంలోని లింగంగుంట్ల వద్ద ఉన్న జిల్లా వైద్యశాలలో కొవిడ్‌ రోగులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. వారంలో మూడు రోజుల పాటు భోజనం పెట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం భోజనం అందుబాటులో ఉన్నా సమయానికి పెట్టకపోవడంతో కరోనా రోగులు అల్లాడుతున్నారు. కనీసం భోజనం చేసేందుకు ప్లేట్లు కూడా ఇవ్వటం లేదని వాపోతున్నారు. మంచినీరు సైతం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి 10.30 గంటలకు రోగులకు పెట్టేందుకు భోజనం తెచ్చారని, అయితే అప్పటికే చాలామంది భోజనం బయట కొనుగోలు చేసి తెచ్చి తినడంతో తెచ్చిన ఆహారాన్ని సిబ్బంది డస్ట్‌బిన్‌లో పడేశారని రోగులు తెలిపారు. సోమవారం భోజనాన్ని మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తీసుకొచ్చారని, అయితే ప్లేట్లు లేవని, ఎవరి ప్లేట్లు వారు కొనుక్కోని తెచ్చుకోవాలని చెప్పరాని తెలిపారు. ఆసుపత్రిలో భోజనం తదితర సౌకర్యాల లేమిపై సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావును వివరణ కోరేందుకు ఫోన్‌లో ‘న్యూస్‌టుడే’ ప్రయత్నించగా స్పందించలేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని