భవన నిర్మాణ కార్మికుల ధర్నా
eenadu telugu news
Published : 21/09/2021 01:37 IST

భవన నిర్మాణ కార్మికుల ధర్నా


ధర్నాలో పాల్గొన్న కార్మికులు

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు నిలిపేయడం అన్యాయమని వెంటనే వాటిని పునరుద్ధరించాలని పల్నాడు భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం రెండేళ్లలో కార్మికుల సంక్షేమ కోసం ఒక్కరూపాయి కేటాయించలేదన్నారు. సంక్షేమ బోర్డులో ఉన్న రూ.450 కోట్లను ప్రభుత్వం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు తరలించి కార్మికుల పొట్ట కొట్టిందన్నారు. జగన్‌ ప్రభుత్వం  ఇసుక కృత్రిమ కొరత సృష్టించి సహజ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచిపెడుతుందని  ఆరోపించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సిలార్‌ శివకుమారి, ఆంజనేయులు, కోటిరెడ్డి, సురేష్, పురుషోత్తం, తదితరులున్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని