రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
eenadu telugu news
Published : 21/09/2021 01:37 IST

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం


 రైతులకు స్ప్రేయర్లను అందజేస్తున్న ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి 

నారాయణపురం (దాచేపల్లి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన నారాయణపురం బంగ్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏడు సంఘాల్లోని రైతులకు తైవాన్‌ స్ప్రేయర్లను పంపిణీ చేశారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సారంగపల్లి అగ్రహారం గ్రామంలో 32 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. తహశీల్దారు వెంకటేశ్వర్లునాయక్, ఏవో సంధ్యారాణి పాల్గొన్నారు. అనంతరం ఇరికేపల్లిలో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించారు. రూ.4.20 కోట్లతో నిర్మించనున్న సిమెంట్‌ రోడ్ల పనులకు భూమి పూజ చేశారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని