నడక దారిలో మొసలి
eenadu telugu news
Published : 27/10/2021 05:49 IST

నడక దారిలో మొసలి

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే : పట్టణంలోని బుగ్గవాగు పక్కనే ఉన్న నడకదారి పైకి ఓ మొసలి మంగళవారం రాత్రి రావటంతో అటు వైపు వెళ్లినవారు దాన్ని చూసి పరుగు తీశారు. చెరువు ప్రాంతంలో బుగ్గవాగు పక్కనే చెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించారు. బుగ్గవాగు పక్కనే ఇది ఉండటంతో వాగులో నుంచి మొసలి ట్రాక్‌పైకి వచ్చింది. ట్రాక్‌ మీద వెళ్లిన వారిని చూసి మళ్లీ అది బుగ్గవాగులోకి వెళ్లింది. అటవీ శాఖ అధికారులు దాన్ని వేరే ప్రాంతంలో వదలాలని ప్రజలు కోరుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని