close

శనివారం, నవంబర్ 28, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొలకలూరి కుటుంబం సాహితీ సేవ అమోఘం

పురస్కారాల ప్రదానోత్సవంలో జస్టిస్‌ గుండా చంద్రయ్య

నారాయణగూడ, న్యూస్‌టుడే: కొలకలూరి కుటుంబమంతా సాహితీపరమైన సేవకు అంకితమవడమే కాకుండా, తమ భావాలను సాహిత్య రూపంలో తెలుగు ప్రపంచానికి అందించి ప్రజలను ఆలోచించేలా చేసిందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్‌ జస్టిస్‌ గుండా చంద్రయ్య వ్యాఖ్యానించారు. జ్యోతి గ్రంథమాల (మీర్‌పేట్‌) ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలోని ఎన్టీఆర్‌ కళా మందిరంలో కొలకలూరి సాహితీ పురస్కార ప్రదానోత్సవం కన్నులపండువగా జరిగింది. శ్రీపద్మావతి విశ్వవిద్యాలయం (తిరుపతి) ఆచార్య కొలకలూరి మధుజ్యోతి అధ్యక్షతన జరిగిన సభలో జస్టిస్‌ చంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాహిత్యం సామాజిక మార్పునకు పదునైన ఆయుధంగా ఉపకరిస్తుందని, ముఖ్యంగా చదువు ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందన్నారు. కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారాన్ని విశాఖపట్నంకు చెందిన చింతకింది శ్రీనివాసరావు రచన ‘బుగతలనాటి చుక్కపల్లి’ నవలకు, కొలకలూరి భాగీరథీ కథానికా పురస్కారాన్ని ఎం.వి.రామిరెడ్డి (హైదరాబాద్‌) రచన ‘వెంటవచ్చునది’కి అందజేశారు. ఈ సందర్భంగా ఆచార్య కొలకలూరి మధుజ్యోతి రచన ‘ఆచార్య కొలకలూరి ఇనాక్‌ సాహిత్య సృష్టి, దృష్టి’, ‘మధూలిక-సాహిత్య వ్యాసాలు’, విహారి రచన ‘అద్వితీయ (ఆచార్య కొలకలూరి ఇనాక్‌ సాహిత్యానుశీలనం), డా.గిన్నారం ఆదినారాయణ రచన ‘ఆది ఆంధ్రుడు కావ్యం-సౌందర్య దృక్పథం’, ఆమ్స్‌ ఆఫ్‌ పార్డన్‌ (ఆచార్య కొలకలూరి సుమకిరణ్‌), గవర్నమెంట్‌ ఫోడర్‌ (డా.కత్తింటి సునంద), దళితోంకి కహానియా, బాఘోంకా కట్‌ఘరా-ఔర్‌ మై!’ (పారనంది నిర్మల)ల ఆవిష్కరణలు జరిగాయి. పరిశోధకులు డా.కె.అరుణాబాయి (ఆచార్య కొలకలూరి ఇనాక్‌ పంచరచనల్లో మానవతావాదం), డా.గల్లా జ్యోత్స్న (ఇనాక్‌ కథలు-సామాజిక దృక్పథం), ఎల్‌.శిరీష (కొలకలూరి ఇనాక్‌ నవలల్లో స్త్రీ పాత్రలు)లకు సన్మానం జరిగింది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.