Published : 05/12/2020 03:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గీతామందిరంలో విగ్రహాల ప్రతిష్ఠ

పూజల్లో పాల్గొన్న భక్తులు

తాండూరు, న్యూస్‌టుడే: తాండూరులోని గీతామందిరంలో రెండోరోజు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఆలయంలో ప్రతిష్ఠించే శ్రీకృష్ణుడు, శ్రీ వేంకటేశ్వర స్వామి, నవగ్రహ, ఆంజనేయ స్వామి విగ్రహాలకు జలాభిషేకం, నవధాన్యాలతో పూజలు చేశారు. సుప్రభాత మేలు కొలుపు, శ్రీమద్భగవద్గీతపారాయణం, సద్గురు దేవతా మూర్తుల పూజ, ఆవాహిత దేవతాపూజ, శ్రీ విష్ణు సహస్రనామ మహాయజ్ఞం, తీర్థప్రసాదాల వితరణ కార్యక్రమాలు నిర్వహించారు.

శివపార్వతుల కల్యాణం..

పూడూరు, న్యూస్‌టుడే: పూడూరు మండలం కడ్మూరులో శివాలయ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ శుక్రవారం మధ్యాహ్నం శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని