
పద్యం శాశ్వతం..
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దత్తాత్రేయశర్మ, నంది శ్రీనివాస్, మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ఏనుగు నరసింహారెడ్డి, కసిరెడ్డి వెంకట్‌రెడ్డి,
కల్వకుంట్ల కవిత, పూసల లింగాగౌడ్, మామిడి హరికృష్ణ, అవుసుల భానుప్రకాశ్, డా.ఎస్.రఘు
నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘పద్యం తెలుగువారి సొంతమని, దానిని శాశ్వతం చేయాల్సిన అవసరం ఉందని’ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కవులు, సాహితీవేత్తలను కోరారు. మెతుకుసీమ (సంగారెడ్డి) ఆధ్వర్యంలో 610 కిపైగా కవుల భాగస్వామ్యంతో ఒకే ఇతివృత్తంతో, ఒకే ప్రక్రియలో ప్రముఖ కవి అవుసుల భానుప్రకాశ్ ప్రధాన సంపాదకత్వంలో తీర్చిదిద్దిన అపూర్వ దేశభక్తి పద్య బృహత్సంకలనం ‘పద్య ప్రభంజనం’ ఆవిష్కరణ సభ ఆదివారం నగరంలోని బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తులోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో నిర్వహించారు. మెతుకుసీమ అధ్యక్షుడు పూసల లింగాగౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో ఆవిష్కర్త కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. చదువు రానివారు కూడా ఒక పద్యం ధారణలో పెట్టుకుంటే భాష బతుకుతుందన్నారు. అఖిల భారత సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ తొలి కార్యదర్శి, కరీంనగర్ జిల్లా అదనపు పాలనాధికారి, కవి డా.ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షులు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, సాహిత్య అకాడమీ కార్యదర్శి, కవి మామిడి హరికృష్ణ, కవులు డా.ఎస్.రఘు, డా.జి.ఎం.రామశర్మ, గండ్ర లక్ష్మణరావు, కంది శంకరయ్య, బోర్పట్ల హన్మంతాచారి, డా.ఆయాచితం నటేశ్వరశర్మ, శాస్తృల రఘురామశర్మ అభినందనలు తెలిపారు.
మెతుకుసీమ సలహాదారు మహీపాల్రెడ్డికి సన్మానం