Published : 12/05/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైద్య సలహాలు, సూచనలు అందిస్తాం


కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న డాక్టర్‌ సందీప్‌

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: కరోనా సోకిన వారు ధైర్యంగా ఉండాలని డాక్టర్‌ సందీప్‌ అన్నారు. మంగళవారం కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ‘హెల్ప్‌లైన్‌’ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులు వేడి నీరు తాగాలని, తప్పని సరిగా ముఖానికి మాస్క్‌ ధరించాలని సూచించారు. పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్‌ మాట్లాడుతూ వైరస్‌ నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. మందులు, టీకాలు సక్రమంగా ఇవ్వటం లేదన్నారు. కార్యదర్శి మహిపాల్‌ మాట్లాడుతూ హెల్ప్‌లైన్‌ ద్వారా వైద్య సలహాలు, సూచనలతో పాటు కౌన్సిలింగ్‌ ఇస్తారని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు డాక్టర్లు సాధు సత్యానంద్‌, సందీప్‌ అందుబాటులో ఉంటారని 96762 82967, 98499 94636 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అశోక్‌, రాములు, అజయ్‌, శ్రీనివాస్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని