పోస్టాఫీసుల్లోనూ రైతు బంధు తీసుకోవచ్చు!
logo
Updated : 18/06/2021 19:48 IST

పోస్టాఫీసుల్లోనూ రైతు బంధు తీసుకోవచ్చు!

హైదరాబాద్: తెలంగాణలోని పోస్టాఫీసుల్లోనూ రైతుబంధు డబ్బులు తీసుకునే సౌలభ్యాన్ని కల్పించినట్లు తపాల శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ వెల్లడించారు. ఎలాంటి అదనపు రుసుం లేకుండా రైతుబంధు సొమ్ము తీసుకోవచ్చన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,794 తపాలా కార్యాలయాల్లో మైక్రో ఏటీఎంలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆధార్‌తో లింక్‌ అయి ఉన్న ఏ బ్యాంకు ఖాతా కలిగి ఉన్నా మైక్రో ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవచ్చన్నారు. రైతులు ఆధార్ కార్డుతో పాటు ఆధార్‌తో లింక్ అయి ఉన్న చరవాణి తీసుకెళ్తే సరిపోతుందని పేర్కొన్నారు. మైక్రో ఏటీఎంలో వేలిముద్ర సాయంతో రోజుకు రూ.10 వేలు నగదు తీసుకోవచ్చన్నారు.  రబీ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 1.73 లక్షల మంది రైతులకు రూ. 169 కోట్లు రైతుబంధు నగదును అందజేసినట్లు శ్రీనివాస్‌ వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని