పవర్‌గ్రిడ్‌ ఉద్యోగులకు టీకా
logo
Published : 19/06/2021 01:38 IST

పవర్‌గ్రిడ్‌ ఉద్యోగులకు టీకా

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం కోసం సంస్థ పలు ప్రైవేటు ఆసుపత్రులతో కలిసి అన్ని కార్యాలయాల్లో ఉచిత టీకా డ్రైవ్‌లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం సికింద్రాబాద్‌లోని పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా దక్షిణ జోనల్‌ కార్యాలయంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. ఏఐజీ ఆసుపత్రి ఆధ్వర్యంలో 154మంది సంస్థ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు టీకాలు వేయించుకున్నట్లు శుక్రవారం సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దేశమంతటా అన్ని ప్రధాన నగరాల్లో ఈ డ్రైవ్‌ కొనసాగిస్తామని.. అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది దాకా ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ చేయించనున్నట్లు వెల్లడించింది. దీంతోపాటు ఉద్యోగుల భద్రత కోసం మాస్కులు, శానిటైజర్లు అందజేస్తున్నామని పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని