చదువుతున్న కళాశాలలోనే డిగ్రీ పరీక్షలు
eenadu telugu news
Published : 27/07/2021 02:49 IST

చదువుతున్న కళాశాలలోనే డిగ్రీ పరీక్షలు

నేడు 240 కేంద్రాల్లో ప్రారంభం

తొలిసారిగా జంబ్లింగ్‌ లేకుండా నిర్వహణ

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఓయూ చరిత్రలోనే తొలిసారి జంబ్లింగ్‌ లేకుండా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు చదివే కళాశాలలోనే రాసేందుకు వర్సిటీ అనుమతించింది. బీఏ, బీఎస్సీ, బీకాం, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ చివరి ఏడాదితోపాటు ఎంబీఏ నాలుగో సెమిస్టర్‌, ఎంసీఏ ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ఒకే తేదీన ప్రారంభం కానున్నాయి. డిగ్రీ చివరి ఏడాదిలో దాదాపు 66 వేల మంది విద్యార్థులు ఉండగా, ఎంబీఏలో 15వేల మంది, ఎంసీఏలో నాలుగు వేల మంది ఉన్నారు. ఇప్పటికే 5వ సెమిస్టర్‌ పూర్తి కాగా, కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఆరో సెమిస్టర్‌ ప్రారంభం కానుంది. పరీక్షల నిర్వహణకు మొత్తం 240 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కనీసం 75 మంది విద్యార్థులు ఉండాలన్న నిబంధన విధించారు. అంతకంటే తక్కువ ఉంటే సమీపంలోని కేంద్రంలో రాసేలా ఏర్పాటు చేశారు.

నిఘా పెంచుతున్నాం: శ్రీరామ్‌ వెంకటేశ్‌, పరీక్షల విభాగం నియంత్రణాధికారి, ఓయూ

విద్యార్థులు చదివిన కళాశాలలోనే పరీక్ష కేంద్రం ఇచ్చిన దృష్ట్యా నిఘా పెంచుతున్నాం. కాపీయింగ్‌ జరగక్కుండా డబుల్‌ స్క్వాడ్‌ వేశాం. వీలైనంత త్వరగా మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటిస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని