టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌కు పూర్వ వైభవం తేవాలి
eenadu telugu news
Published : 29/07/2021 01:44 IST

టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌కు పూర్వ వైభవం తేవాలి

సమావేశానికి హాజరైన తెలంగాణ టూర్స్‌ అండ్‌ ట్రావెల్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు

సోమాజిగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా వన్నె కోల్పోయిన టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ రంగంలో పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం తగిన కృషి చేయాలని తెలంగాణ టూర్స్‌ అండ్‌ ట్రావెల్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ కోరింది. ఈ మేరకు బుధవారం గ్రీన్‌ల్యాండ్స్‌లోని హరిత ప్లాజా హోటల్‌లో అసోసియేషన్‌ నేతలు సమావేశమై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌వీ.రమణ, కె.శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలోనూ ప్రభుత్వం రీస్టార్ట్‌ ప్యాకేజీని కల్పించాలని కోరారు. పర్యాటక రంగం రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు నెలకు రూ. 5వేల చొప్పున ఉపకార వేతనంగా ఇవ్వాలని, టీఎస్‌టీడీసీలో ట్రావెల్‌ ఏజెంట్లకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని, టూర్‌ ఆపరేటర్లకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని కోరారు. సంఘం ఉపాధ్యక్షుడు దేవేందర్‌ కడప, సంయుక్త కార్యదర్శి కె.రమణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని