ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు: కిసాన్‌మోర్చా
eenadu telugu news
Published : 01/08/2021 00:59 IST

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు: కిసాన్‌మోర్చా


కుల్కచర్లలో మాట్లాడుతున్న కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్‌రెడ్డి

కుల్కచర్ల, న్యూస్‌టుడే: ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులను తెరాస ప్రభుత్వం దోపిడీ చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజాసమస్యలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. శనివారం కుల్కచర్ల మండల కేంద్రంలో వరిధాన్యం కోనుగోళ్ల అక్రమాలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులతో కలసి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాన్ని అందించారు. అనంతరం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెరాస నాయకులు మిల్లర్లతో కుమ్మకై అన్నదాతలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతు బీమా డబ్బులను కొట్టేసిన ఘనతా తెరాసదే అని అన్నారు. పుట్టాపహాడ్‌లో కొనుగోలు కేంద్రానికి సంబంధించి మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో క్షేత్రస్థాయి నుంచి ప్రజాసమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని