అధికారుల నిర్లక్ష్యంతోనే రోడ్లపై గుంతలు
eenadu telugu news
Published : 01/08/2021 02:03 IST

అధికారుల నిర్లక్ష్యంతోనే రోడ్లపై గుంతలు


రోడ్డుపై గుంతలను పూడుస్తున్న కట్నం గంగాధర తిలక్‌

సోమాజిగూడ, న్యూస్‌టుడే: లక్షలు వెచ్చించి సీసీ రోడ్లు, వీడీసీసీ రోడ్లు వేస్తున్న అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గుంతలు ఏర్పడుతున్నాయని శ్రమదాన్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులు కట్నం గంగాధర తిలక్‌ అన్నారు. తాను వెళ్తున్న మార్గంలో ఎక్కడ గుంతలు కనిపించినా పూడ్చివేస్తూ సామాజిక సేవ చేస్తున్న ఆయన శనివారం అమీర్‌పేట మార్కెట్‌ నుంచి బొంగులబస్తీ మార్గంలో రోడ్డుకు మరమ్మతులు చేశారు. సీసీ రోడ్డుకు గుంతలు కాగా అందులో ఉన్న మట్టిని ఊడ్చి డాంబార్‌తో పూడ్చి చదును చేశారు. తాను ఇప్పటి దాకా పూడ్చిన గుంతల్లో ఇది 2,036వది అని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని