తరుణి పరిస్థితి విషమం
eenadu telugu news
Published : 04/08/2021 02:24 IST

తరుణి పరిస్థితి విషమం

కారు నడిపిన యువకుడి అరెస్టు

పబ్‌ నిర్వాహకులకూ రిమాండ్‌


అభిషేక్‌                      సుయంత్‌                     ప్రనీష్‌

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: మద్యం తాగి కారు నడిపి ఓ యువతి మృతి కారణమైన యువకుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ గోనె సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మత్తులో ఉన్న అభిషేక్‌(21) కారును వేగంతో నడపటంతో కొండాపూర్‌ మైంహోం మంగళ అపార్టుమెంట్స్‌ సమీపంలో అదుపు తప్పి పక్కనే బండరాళ్లను ఢీకొట్టింది. కారు మూడు పల్టీలు కొట్టడంతో వెనుక సీటులో కూర్చున్న అశ్రిత, తరుణిలు తీవ్రగాయాలపాలు కాగా ఆశ్రిత ఆసుపత్రికి తరలించేలోపు మరణించింది. తరుణి తీవ్రగాయాలతో కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అభిషేక్‌ను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.

పబ్‌ నిర్వహకులకూ.. బోనాలను పురస్కరించుకొని ఆది, సోమవారాల్లో మద్యం విక్రయాల నిలిపివేత నిబంధనలను పట్టించుకోకుండా మాదాపూర్‌ హైటెక్స్‌ రోడ్డులోని స్నార్ట్‌ పబ్‌ నిర్వహకులు ఆదివారం రాత్రి అభిషేక్‌ బృందానికి మద్యం సరఫరా చేశారు. మద్యం తాగిన వ్యక్తి కారు డ్రైవ్‌ చేయకుండా అడ్డుకోవాల్సిన పబ్‌ నిర్వహకులు ఇదేమీ పట్టించుకోకపోవడం కారణంగా పబ్‌ యజమాని చెంగల సూర్యనాథ్‌ (36), మేనేజర్‌ ప్రనీష్‌(43)లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని