ఉద్యోగాల భర్తీకి తలసాని ఇల్లు ముట్టడి
eenadu telugu news
Updated : 04/08/2021 02:26 IST

ఉద్యోగాల భర్తీకి తలసాని ఇల్లు ముట్టడి


మారేడ్‌పల్లిలో మంత్రి ఇంటిని ముట్టడించడానికి వచ్చిన విద్యార్థులను అరెస్టు చేస్తున్న పోలీసులు

మారేడుపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని శాఖల పోస్టులు భర్తీ చేయాలని, ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటించాలని ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్‌), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో మంగళవారం వెస్ట్‌మారేడుపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇంటిని ముట్టడించారు. పీవైఎల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.ప్రదీప్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్‌పల్లి రాములు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. మూడేళ్లలో 165 మంది నిరుద్యోగులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకొన్నారని అన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వర్‌రావు, సహయ కార్యదర్శి పి.మహేష్‌, నగర అధ్యక్ష, కార్యదర్శులు అనిల్‌, గడ్డం శ్యామ్‌, సుమంత్‌, పీవైఎల్‌ నాయకులు శ్రీనివాస్‌, కృష్ణ, పీడీఎస్‌యూ నేతలు అనిల్‌, సాయి, గణేష్‌, వినయ్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని