భర్తతో గొడవ.. ఆపై అపశకునాలని!
eenadu telugu news
Updated : 05/08/2021 05:06 IST

భర్తతో గొడవ.. ఆపై అపశకునాలని!

ఫిలింనగర్‌లో గృహిణి ఆత్మహత్య


కబిత

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో చిన్న గొడవ.. ఆ కోపంలో ఆత్మహత్యకు సిద్ధమైంది. ఇదే క్రమంలో దేవుడికి పూజ చేయడానికి సిద్ధపడింది.. హారతిచ్చే ప్రయత్నం చేయగా అది ఆరిపోయింది.. ముత్తయిదువగా తనువు చాలించాలని భావించి నుదుట కుంకుమ పెట్టుకొనే ప్రయత్నం చేయగా కుంకుమ భరణి చేజారింది.. ఇవి అపశకునాలేనని.. తన ఆయుష్షు తీరిందని ఆమె భావించింది. అంతే.. సెల్ఫీ వీడియో తీసుకొని తనువు చాలించింది.. జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధి జరిగిన ఘటన వివరాలివి. జార్ఖండ్‌ ప్రాంతానికి చెందిన ఓం ప్రకాశ్‌, కబిత(23)లు ఆరేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకొన్నారు. వీరు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 78 సమీపంలోని అంబేడ్కర్‌ నగర్‌లో ఓ ఇంటి మూడో అంతస్తులో నివసిస్తున్నారు. వీరికి కుమార్తె శివాని(4) ఉంది. కాపలాదారుగా పనిచేసే ఓంప్రకాశ్‌ మంగళవారం తన కుమార్తెను తీసుకొని పనికి వెళ్లాడు. రాత్రి 7.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపు ఎన్నిసార్లు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చిన అతను కిటికీలో నుంచి చూశాడు. కబిత ఫ్యానుకు ఉరి వేసుకొని కనిపించడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చిన్నపాటి గొడవ జరిగిందని, అంతకుమించి ఏమీ లేదని అతను ప్రాథమికంగా తెలిపాడు. కబిత చరవాణిని స్వాధీనం చేసుకొని పరిశీలించగా సెల్ఫీ వీడియోలు గుర్తించారు. ఇంటి యజమాని కిషోర్‌కుమార్‌ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని