రంగారెడ్డి జిల్లాను ఎగుమతుల కేంద్రంగా చేద్దాం
eenadu telugu news
Published : 21/09/2021 02:11 IST

రంగారెడ్డి జిల్లాను ఎగుమతుల కేంద్రంగా చేద్దాం

సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, అధికారులు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాను ఎగుమతుల హబ్‌గా తీర్చిదిద్దాలని జిల్లా అదనపు పాలనాధికారి ప్రతీక్‌ జైన్‌ సూచించారు. వాణిజ్య ఎగుమతులపై సోమవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నందున జిల్లా నుంచి మామిడి పండ్లు, పూలు, కూరగాయలు ఎగుమతి చేసేలా ప్రోత్సహించాలని పరిశ్రమల శాఖ అధికారిని ఆదేశించారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీలను తెలియజేయాలన్నారు. ఈనెల 24న ఖైరతాబాద్‌లోని జడ్పీ కార్యాలయంలో ఎగుమతిదారులతో సమావేశం నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్‌ వెల్లడించారు. పరిశ్రమల శాఖ జీఎం రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖాధికారి గీతారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి డాక్టర్‌ సునందరాణి, లీడ్‌బ్యాంకు మేనేజర్‌ రిజ్వాన్‌, ఏజీఎం హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని