Hyderabad News: 100 శాతం బస్సులు రోడ్లపైకి
eenadu telugu news
Published : 21/09/2021 07:21 IST

Hyderabad News: 100 శాతం బస్సులు రోడ్లపైకి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: విద్యాసంస్థలు పునఃప్రారంభం అయిన నేపథ్యంలో 100 శాతం బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ హైదరాబాద్‌ రీజియన్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. కొవిడ్‌ నేపథ్యంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు 50 శాతం బస్సులతో ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం నుంచి హైదరాబాద్‌ ప్రాంతీయ పరిధిలోని 1,286 ఆర్టీసీ బస్సులు, 265 అద్దె బస్సులతో మొత్తం 1,551 షెడ్యూల్‌ బస్సులను నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రాంతీయ పరిధిలో ప్రతి రోజు 4.25 లక్షల కిలోమీటర్లు, 18,478 ట్రిప్పులను నగరంతో పాటు శివారు గ్రామాలు, మండలాలకు నడపనున్నట్లు తెలిపారు. శానిటైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. సందేహాలు, సలహాలు, సూచనలకు వాట్సాప్‌ నంబర్‌ 9959226160కు సంప్రదించాలని హైదరాబాద్‌ రీజనల్‌ మేనేజర్‌ చెరుకుపల్లి వెంకన్న సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని