తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కుటుంబం ఆత్మహత్యాయత్నం
eenadu telugu news
Updated : 28/10/2021 20:41 IST

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కుటుంబం ఆత్మహత్యాయత్నం

పరిగి: తాము కొనుగోలు చేసిన భూమిని యజమాని రిజిస్ర్టేషన్‌ చేయకపోవడంతో మనస్తాపం చెందిన ఓ కుటుంబం పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా పరిగి తహసీల్దారు కార్యాలయం వద్ద గురువారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన జంగయ్య తండ్రి లచ్చయ్య సుమారు 4 దశాబ్దాల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 4.18ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే, అప్పటి నుంచి భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ జరగలేదు. కొనుగోలు దారులు ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్‌కు పిలిచినా యజమాని మాత్రం నేడు, రేపంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో విసిగిపోయిన జంగయ్య గత్యంతరం లేక తన భార్య జంగమ్మ, కుమారుడు గణేశ్‌తో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పెట్రోలు పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా గమనించిన రెవెన్యూ సిబ్బంది, స్థానికులు వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విషయమై తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డిని వివరణ కోరగా బాధితులెప్పుడూ సమస్యను తమ దృష్టికి తీసుకురాలేదని, పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని