రోడ్డుపైనే మురుగు పరుగు
eenadu telugu news
Published : 20/09/2021 03:25 IST

రోడ్డుపైనే మురుగు పరుగు

హుజూరాబాద్‌-సైదాపూర్‌ రోడ్డులో మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పైపులైన్‌ పనులు ప్రారంభించి రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో నిర్మాణం కాలేదు. గోతులతో అసంపూర్తిగా ఉండటంతో వాహన చోదకులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

* హుజూరాబాద్‌లోని బుడిగజంగాల కాలనీకి వెళ్లే దారిలో రోడ్డుపైనే మురుగు ప్రవహిస్తోంది. దీనిని పట్టించుకునే వారే కరవయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు రోడ్డుపైనే ఉండటంతో పాదచారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, హుజూరాబాద్‌ గ్రామీణం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని