
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
మాట్లాడుతున్న ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు
కర్నూలు సచివాలయం : ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడతామని ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని రెవెన్యూ పొదుపు భవన్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు గిరికుమార్రెడ్డి రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అసోసియేట్ అధ్యక్షులు నాగమణి, నాయకులు జగదీష్, వెంకటరాజు, లోకేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags :