Published : 22/04/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కుదిరిన పెళ్లి... నిరాకరించిన వరుడు

గుత్తి, న్యూస్‌టుడే: వారిద్దరికి పెళ్లిచూపులు జరిగాయి. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలు కట్నకానుకలు మాట్లాడుకున్నారు. మే నెలలో వివాహం జరిపించేందుకు నిశ్చయతాంబూలాలు అందుకున్నారు. 15 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. పెద్దలు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈలోగా వరుడు తనకు అమ్మాయి నచ్చలేదని, తాను పెళ్లి చేసుకోలేనని మొండికేశాడు. గుత్తికి చెందిన ఓ యువకుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ఓ యువతితో పెళ్లిచూపులు చూసి ఇష్టపడ్డాడు. అమ్మాయి తల్లిదండ్రులు రూ.5లక్షల కట్నంతోపాటు 20తులాల బంగారు ఇచ్చేందుకు నిర్ణయించారు. పెళ్లికి నిశ్చయ తాంబూలాలు తీసుకున్నారు. తర్వాత వరుడు సుముఖత చూపకపోవడంతో పెళ్లి రద్దయింది. పెళ్లిచూపుల్లోనే అమ్మాయి నచ్చలేదని చెప్పి ఉండాల్సిందని, ఇప్పుడు తమ పరువుపోయిందని, తమ కుమార్తె భవిష్యత్తు ఏం కావాలని అమ్మాయి తల్లిదండ్రులు వాపోతున్నారు. తప్పు చేసినందుకు తమకు రూ.18లక్షలు కట్టాలని అమ్మాయి తరఫున వారు పెద్దలతో రెండు రోజుల కిందట పంచాయితీ పెట్టారు. తాము రూ.12లక్షలు చెల్లిస్తామని వరుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా పంచాయితీ తెగలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని