రాయలసీమ చరిత్ర గొప్పది
eenadu telugu news
Published : 27/09/2021 04:01 IST

రాయలసీమ చరిత్ర గొప్పది

పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఎంపీ, కవులు తదితరులు

నంద్యాల క్రీడా విభాగం, న్యూస్‌టుడే: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కవులు తమ రచనలతో బయటకు తీసుకురావడం అభినందనీయమని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. స్థానిక వివేకానంద ఆడిటోరియంలో ప్రముఖ దంత వైద్యుడు కిశోర్‌ కుమార్‌ రాసిన ‘అవుకు సీమ సంగ్రహ చరిత్ర’ పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడుతూ కళలపై మక్కువ ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అవుకును పాలించిన రాజులు, పండగలు, పాఠశాల, ఉత్సవాలు, శాసనాలు, ప్రజాహిత కార్యక్రమాలు పుస్తకంలో పదిల పరచడం బాగుందన్నారు. నేటి తరానికి ఇది ప్రేరణగా ఉంటుందన్నారు. రచయిత కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఈ పుస్తకం రాయడానికి తనకు పాఠాలు చెప్పిన గురువులు, స్నేహితులు సహకరించారన్నారు. చిన్నప్పుడు అవుకులో చదువుకున్నందుకు ఇలా రాయాలని అక్కడి చరిత్ర అందరికీ తెలియజేయాలని అనిపించిందన్నారు. ఈ కార్యక్రమంలో డా.జి.రామకృష్ణారెడ్డి, డా.జి.రవికృష్ణ, కవులు డా.దీవి హయగ్రీవాచార్యులు, డా.గెలివి సహదేవుడు, శ్రీనిధి రఘువీర్‌, గుండం శేషిరెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని