Published : 26/11/2020 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మన ఊరికి-మన గురుకులం

నకిరేకల్‌ గురుకుల పాఠశాల విద్యార్థుల నల్గొండ సందర్శన


పానగల్‌ పాఠశాలలో మాట్లాడుతున్న ప్రాంతీయ సమన్వయ కర్త అరుణకుమారి

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: నకిరేకల్‌ సాంఘిక బాలికల గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో ‘మన ఊరికి-మన గురుకులం’ కార్యక్రమం నల్గొండలోని పానగల్‌ పిచ్చిరెడ్డి మెమోరియల్‌ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమాన్ని గురుకుల విద్యాలయ సంస్థ ప్రాంతీయ సమన్వయ కర్త అరుణకుమారి, నకిరేకల్‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ సునీత ప్రారంభించి మాట్లాడారు. ఆన్‌లైన్‌ తరగతుల వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బోధనను సద్వినియోగం చేసుకోవాలని సందేహలు ఉంటే నివృత్తి చేసుకోవాని సూచించారు. విద్యార్థుల్లో ప్రేరణ కల్పించే లక్ష్యంతో మన ఊరికే గురుకులం పేరిట నూతన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి వారం ఒక మండలంలో 10 కీ.మీ పరిధిలోని గురుకులాలకు చెందిన విద్యార్ధులను ఒక్క చోటికి రప్పించి తరగతులు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపోందించారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని