భువనగిరి ఖిల్లాపై స్వచ్ఛభారత్‌
eenadu telugu news
Published : 20/09/2021 03:48 IST

భువనగిరి ఖిల్లాపై స్వచ్ఛభారత్‌


ప్లాస్టిక్‌ వ్యర్థాలను బస్తాల్లో సేకరించిన బీఎంఎస్‌సభ్యులు

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: భువనగిరి కోటపై హైదరాబాద్‌కు చెందిన బాడీ మైండ్‌ సోల్‌(బీఎంఎస్‌) సభ్యులు ఆదివారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమం చేపట్టారు. బీఎంఎస్‌ సభ్యులు తమ కుటుంబ సభ్యులతో ఉదయం కోటకు వచ్చారు. కోటపైకి వెళ్లి పలు ప్రాంతాల్లో సందర్శకులు పడేసి ప్లాస్టిక్‌ వ్యర్థాలు, సీసాలను బస్తాల్లో సేకరించి కిందికి తీసుకువచ్చారు. కోట గైడ్‌ ఆవుల వినోద్‌కుమార్‌కు రెండు చెత్త బుట్టలు అందజేశారు. బృందం ప్రతినిధి చెల్లయ్య మాట్లాడుతూ గతంలో వ్యక్తిగతంగా కోట సందర్శనకు వచ్చినప్పుడు ప్లాస్టిక్‌ వ్యర్థాలు పడి ఉండటాన్ని గమనించానని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్న లక్ష్యంతో వ్యర్థాలను సభ్యులు, వారి కుటుంబసభ్యులు 200 మంది సహకారంతో తొలగించామని చెప్పారు. సందర్శకులు తమ వెంట కోటపైకి తీసుకెళ్లే ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా కిందికి తీసుకువచ్చి చెత్తబుట్టల్లో వేయాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని