ధాన్యం సేకరణకు పకడ్బందీ ప్రణాళిక
eenadu telugu news
Published : 19/10/2021 05:38 IST

ధాన్యం సేకరణకు పకడ్బందీ ప్రణాళిక

ధాన్యం సేకరణపై అధికారులతో సమీక్షిస్తున్న అదనపు కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌

నల్గొండ సంక్షేమం, నల్గొండ విద్యావిభాగం: జిల్లాలో వరి ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండ కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్‌ ఛాంబర్‌లో పౌరసరఫరాలశాఖ, మిల్లర్లు, డీఆర్‌డీవో, సహకార, వ్యవసాయ, రవాణాశాఖ అధికారులతో ధాన్యం సేకరణ, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షించారు. ఐకేపీ ద్వారా 87 కేంద్రాలు, పీఏసీఎస్‌ల ద్వారా 30, మార్కెటింగ్‌ శాఖ ద్వారా 76 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆయా శాఖల అధికారులు సమాయత్తంగా ఉన్నారని చెప్పారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తైన ప్రాంతంలో, వర్షం నీరు నిల్వ లేకుండా ఉండేలా ఏర్పాటు చేయాలని, నాణ్యత ప్రమాణాల మేరకే ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు. తూకం యంత్రాలు, టార్పాలిన్ల సమస్య గోనె సంచులు, లారీల ఏర్పాట్ల సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. తూకం యంత్రాలకు తూనికల కొలతల శాఖ సీళ్లు వేయాలని, నిర్ణీత తేమ శాతంతో ధాన్యం తీసుకువచ్చేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలన్నారు. క్రమపద్ధతిన టోకెన్లు జారీచేసి కొనుగోలు చేయాలని ఆదేశించారు. 

ఇంటర్‌ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష: నల్గొండ విద్యావిభాగం: ఈనెల 25 నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఛాంబర్‌లో పరీక్షలపై జిల్లాస్థాయ సమన్వయకమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని 119 విద్యాసంస్థల నుంచి 16,854 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు చెప్పారు. రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 4 సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ఇంటర్‌ విద్యనోడల్‌ అధికారి ఆర్‌.దస్రునాయక్‌, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, జూనియర్‌ కళాశాలల ప్రన్సిపల్‌లు వి.భానునాయక్‌, కె.నరేంద్రకుమార్‌, అధ్యాపకుడు ఎండి.ఇస్మాయిల్‌, హైపవర్‌ కమిటీ సభ్యుడు సింగం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని