పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
eenadu telugu news
Published : 24/10/2021 05:03 IST

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

పట్టణంలో స్వచ్ఛ ర్యాలీ

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌-2021ను పురస్కరించుకొని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో స్వచ్ఛ శనివారంగా పాటిస్తూ ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి కె.ధనుంజయ్‌ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అన్నారు. ప్రధాన కూడళ్లలో చెత్త పడేయడం వల్ల దుర్వాసనతో రోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రతి వారం తప్పనిసరిగా స్వచ్ఛ శనివారం పాటించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని