మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య
eenadu telugu news
Published : 28/10/2021 02:14 IST

మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య

నెల్లూరు (నేర విభాగం) : భార్య మద్యం తాగొద్దన్నందుకు మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై నవాబుపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి కథనం మేరకు.. వెంకటేశ్వరపురం మున్సిపల్‌ హైస్కూలు సమీపంలో పి.అనిల్‌కుమార్‌(34), రాజేశ్వరి దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ప్లిలలు. అనిల్‌ కుమార్‌ నగరంలోని పండ్ల మార్కెట్‌లో పనిచేస్తూ వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మద్యానికి బానిసైన ఆయన సంపాదనంతా మద్యానికి ఖర్చు చేస్తున్నాడు. దాంతో పలు మార్లు భార్య మందలించేవారు. ఈ నెల 26న ఫూటుగా మద్యం తాగి రావడంతో భార్య నిలదీశారు. దాంతో మనస్తాపానికి గురైన ఆయన మంగళవారం సాయంత్రం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయన్ను 108 సాయంతో నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన తల్లి వేళాంగిణి బుధవారం నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై బి.రమేష్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని