బడి తలుపులు బార్లా తెరిచారు
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

బడి తలుపులు బార్లా తెరిచారు

ప్రహరీలు, కాపలాదారులు లేక రక్షణ కరవు
న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం

కామారెడ్డి మండలం గర్గుల్‌లో ప్రహరీ లేని ప్రభుత్వ పాఠశాల

ప్రభుత్వ బడులకు భద్రత కరవైంది. ప్రహరీలు, కాపలాదారులు లేక సమస్య జటిలమవుతోంది. చోరీలు జరుగుతున్నా యంత్రాంగం చోద్యం చూస్తోంది. విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా బడులకు రక్షణ లేకుండా పోతోంది. ఉభయ జిల్లాల్లో ప్రహరీ లేని బడులు 1,771  ఉన్నాయి. కొన్నింటికి ఉన్నా శిథిలమయ్యాయి. కొవిడ్‌ కారణంగా ఏడాదికిపైగా పాఠశాలలు మూసి ఉండటంతో ఆకతాయిల తలుపులు ధ్వంసం చేయడం, ఫ్యాన్లు తొలగించడం, వంట సామగ్రిని ఎత్తుకెళ్లడం వంటి చర్యలకు పాల్పడ్డారు. చాలా బడులు రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.

ఆకతాయిలు ధ్వంసం చేసిన కామారెడ్డి గంజ్‌ ఉన్నత పాఠశాల తలుపులు

ప్రత్యేక దృష్టి సారిస్తేనే
విద్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తేనే సమస్యను అధిగమించే అవకాశం ఉంది. తాత్కాలికంగా కాపలాదారులను నియమిస్తే చోరీలు అరికట్టవచ్చు. ప్రధానోపాధ్యాయులు బడుల భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి.


ఇవీ సమస్యలు

ఉమ్మడి జిల్లాలో ఏళ్లుగా కాపలాదారుల నియామకాలు లేక బడులకు రక్షణ కరవైంది.  

* ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో 10, నిజామాబాద్‌లో 16 మంది మాత్రమే ఉన్నారు.  

* ఉన్నత, సక్సెస్‌ పాఠశాలలకు వివిధ పరికరాలను అందజేశారు.

* దాదాపు ఉభయ జిల్లాల్లో 2 వేల వరకు కంప్యూటర్లు, సీపీయూలు ఉన్నాయి.

* ప్రతి పాఠశాలలో ఫ్యాన్లు, వంట సామగ్రి, ఇతర ఆట వస్తువులు అందుబాటులో ఉన్నాయి.

* రాత్రిపూట కాపలాదారులు లేక విలువైన సామగ్రి దొంగలపాలవుతున్నాయి.


తాత్కాలిక కంచె ఏర్పాటు చేస్తాం

ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనకు ప్రత్యేక సర్వే చేపట్టి ప్రభుత్వానికి నివేదిక పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రహరీలు లేని చోట తాత్కాలికంగా కంచె ఏర్పాటు చేయిస్తాం.

- రాజు, డీఈవో, కామారెడ్డిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని