సమన్వయంతో వివాదాలు పరిష్కరించాలి
eenadu telugu news
Published : 21/10/2021 06:08 IST

సమన్వయంతో వివాదాలు పరిష్కరించాలి

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో వ్యవహరించి భూవివాదాలు పరిష్కరించాలని పాలనాధికారి జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం అటవీ, రెవెన్యూ భూ సమస్యలపై సమీక్షించారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యను పరిశీలించి అటవీభూములకు కంచె ఏర్పాటు చేయాలని సూచించారు. ధరణి ఫిర్యాదులు పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. మినీ బృహత్‌ ప్రకృతివనాల కోసం బీర్కూర్‌, దోమకొండ, నస్రుల్లాబాద్‌ మండలాల్లో ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే, డీఎఫ్‌వో నిఖిత, ఆర్డీవో రాజాగౌడ్‌, ఏవో రవీందర్‌ పాల్గొన్నారు.

ఓటరు జాబితా సరిదిద్దుకోవాలి
కామారెడ్డి కలెక్టరేట్‌: ఓటరు జాబితాలో తప్పులుంటే సరిదిద్దుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబరు 1న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేస్తామని తెలిపారు. అదే నెల 30 వరకు జాబితాల్లో తప్పులుంటే బూత్‌స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. రాజకీయ పార్టీలకు సీడీ, పెన్‌డ్రైవ్‌ ద్వారా జాబితా అందజేస్తామని పేర్కొన్నారు. ఆర్డీవో రాజాగౌడ్‌, సూపరింటెండెంట్‌ సరళ, తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు
కామారెడ్డి కలెక్టరేట్‌: ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని పాలనాధికారి జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం ఇంటర్‌ పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 42 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం ప్రతి గదిలో 20 మంది విద్యార్థులనే కేటాయించాలన్నారు. ఒక్కో కేంద్రం వద్ద రెండు ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇంటర్‌ నోడల్‌ అధికారి షేక్‌ సలాం, హైపవర్‌ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

న్యాయ సాయంపై అవగాహన
కామారెడ్డి కలెక్టరేట్‌: స్వాత్రంత్య అమృత మహోత్సవాల్లో భాగంగా గ్రామస్థాయిలో ఉచిత న్యాయసేవా సాయం పొందడానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. సమీకృత కార్యాలయంలో బుధవారం అధికారులతో నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయిలో వివిధ శాఖల చట్టాల గురించి అవగాహన కల్పించాలన్నారు. సర్పంచులు, అధికారులు గ్రామాల్లో లీగల్‌ సర్వీస్‌ చట్టాల గురించి వివరించాలని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని