ఎనిమిది మంది పాన్‌ దుకాణదారులపై కేసులు
eenadu telugu news
Published : 24/10/2021 04:51 IST

ఎనిమిది మంది పాన్‌ దుకాణదారులపై కేసులు

సోదాలు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని పాన్‌ దుకాణాలపై పట్టణ, గ్రామీణ పోలీసులు శనివారం రాత్రి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తా, సిరిసిల్ల రోడ్డు, రైల్వేస్టేషన్‌, పంచముఖి హనుమాన్‌, గుమస్తాకాలనీ, దేవునిపల్లి కాలనీలోని ఎనిమిది కోకాల్లో అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. యజమానులపై కేసులు నమోదు చేశారు. పట్టణ సీఐ మధుసూదన్‌, గ్రామీణ ఇన్‌ఛార్జి సీఐ నరేష్‌, పట్టణ, దేవునిపల్లి ఎస్సైలు శ్రీనివాస్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని