ఇంటర్‌ సప్లిమెంటరీ ఆరంభం
eenadu telugu news
Published : 16/09/2021 05:47 IST

ఇంటర్‌ సప్లిమెంటరీ ఆరంభం


అంజయ్య రోడ్డులోని ఓ కళాశాల వద్ద పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 93 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరోనా వల్ల జూనియర్, సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు జరపకుండా ఫీజు చెల్లించిన వారందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. మార్కులు కావాలని కోరుకునే వారికి ఇప్పుడు మరో దఫా పరీక్షలు రాసుకునే అవకాశం కల్పించారు. అయితే సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్‌లో చేరిపోయినందున కొద్దిమంది మాత్రమే పరీక్షలు రాస్తున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలకు మాత్రం స్పందన బాగుంది. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షకు 31,506 మందికి గాను జిల్లా వ్యాప్తంగా 20,551 మంది హాజరయ్యారు. ఇవి ఈ నెల 23 వరకు జరగనున్నాయని అధికారులు తెలిపారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని