అమూల్‌ నూతన కేంద్రాల ఏర్పాటుకు సర్వే
eenadu telugu news
Published : 15/10/2021 04:19 IST

అమూల్‌ నూతన కేంద్రాల ఏర్పాటుకు సర్వే

జగనన్న పాల వెల్లువ పురోగతిపై సమీక్ష

నిర్వహిస్తున్న సంయుక్త కలెక్టర్‌ టీ.ఎస్‌.చేతన్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో అమూల్‌ నూతన పాల కేంద్రాల ఏర్పాటుకు సర్వే నిర్వహించాలని సంయుక్త కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ కోర్‌ బృంద సభ్యులను ఆదేశించారు. జగనన్న పాల వెల్లువ పురోగతిపై ప్రకాశం భవన్‌లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూట్‌ నంబరు 7, 12, 15లలో ఈ నెలాఖరులోపు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. అలాగే సేకరించే శాంపిల్‌ పాలను అదే కేంద్రాల్లో పోయడం ద్వారా కార్యదర్శులకు అదనపు రాబడి వస్తుందన్నారు. పాలు చెడిపోకుండా డాక్‌కు పంపాల్సిందిగా సూచించారు. పాల సేకరణ, అలాగే పాలు పోస్తున్న రైతులు తక్కువగా ఉన్న కేంద్రాలపై సమీక్షించారు. సమావేశంలో సీపీవో వెంకటేశ్వర్లు, రూట్‌ ఇంఛార్జులు, అమూల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని