దళిత బహుజన జాగృతి సంస్థ ఏర్పాటు
eenadu telugu news
Published : 22/10/2021 03:12 IST

దళిత బహుజన జాగృతి సంస్థ ఏర్పాటు

సమావేశంలో పాల్గొని అభివాదం చేస్తున్న సంఘాల ప్రతినిధులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: దళిత బహుజన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఏకతాటిపై నిలిచి పోరాడాలని గురువారం నిర్వహించిన కార్యక్రమంలో తీర్మానించారు. స్థానిక ఎన్జీవో హోంలో ఎస్‌టీఎఫ్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, విద్యార్థి ఐకాస, ఏఎస్‌ఏ, బీఎస్‌, బీఎస్‌ఎఫ్‌ సంఘాలు సమావేశమై రాష్ట్రస్థాయిలో సంస్థను ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. ఐకాస అధ్యక్షుడు రాయపాటి జగదీష్‌ మాట్లాడుతూ.. మందు, డబ్బులకు బానిసలవుతున్న యువతను మేల్కొలిపి హక్కులు సాధించుకుని అంబేడ్కర్‌ ఆలోచనా విధానంలో రాజ్యాధికారం సాధించుకోవాలన్నారు. దళిత విద్యార్థులు చదివే సంక్షేమ వసతి గృహాల్లో రేషన్‌ బియ్యమే గతి అయిందన్నారు. కృష్ణానాయక్‌ మాట్లాడుతూ.. గిరిజన తండాల్లో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లేవన్నారు. సురేష్‌ మాట్లాడుతూ.. నాడు- నేడు ద్వారా అన్ని సంక్షేమ వసతి గృహాల్లో వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్మణ్‌, కిరణ్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలు చేశారు. 77 జీవో రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇవ్వాలని, ప్రభుత్వం రద్దు చేసిన 15 ఎస్సీ, ఎస్టీ పథకాలను పునరుద్ధరించాలని, ప్రభుత్వం ప్రకటించిన 56 కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని